• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అగ్ని ప్రమాదం.. భయాందోళనలోరైతులు..!

MHBD: ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలతో రైతులు తీవ్రంగా భయాందోళన చెందిన ఘటన కొత్తగూడ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాలపురం రహదారి వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పును వదిలారు. రహదారితో పాటు పరిసర ప్రాంతంలో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. సమీపంలోని మొక్కజొన్న పంటల వైపు వెళ్లడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.

March 4, 2026 / 07:39 PM IST

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్

WNP: పెద్దమందడి, వెల్టూర్‌లలో కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం పర్యటించారు. పలువురు లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలకు అవుతున్న ఖర్చుపై ఆరాతీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణాలకు ఎక్కడ అప్పు తీసుకోవద్దని, ఆర్థిక ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని MPDOను ఆదేశించారు.

March 4, 2026 / 07:38 PM IST

కాంగ్రెస్ జిల్లా నాయకుడికి వినతి

BPHL: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఇవాళ MRPS ఆధ్వర్యంలో రాజ్యసభ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం CON పార్టీ జిల్లా నాయకుడు  కరుణాకర్‌కు వినతిపత్రం అందజేశారు. MRPS నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలు 1 మాదిగలకు కేటాయించాలని కోరారు.

March 4, 2026 / 07:37 PM IST

‘కుటుంబానికి మేము అండగా ఉంటాం’

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఇటీవల ఢిల్లీ నిరసనల్లో అరెస్ట్ అయిన జడ్చర్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

March 4, 2026 / 07:36 PM IST

మేడ్చల్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నిరసన

MDCL: బోడుప్పల్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌కు లేఖ అందజేశారు. భర్తీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

March 4, 2026 / 07:36 PM IST

ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం

NLG: శాలి లింగోటం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోనేటి అఖిల్, లోడే ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 4, 2026 / 07:33 PM IST

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికతో జిల్లా మార్పుకు శ్రీకారం

GDWL: ప్రభుత్వ ఫలాలు ప్రతి గడపకూ చేరాలి, ఏ ఒక్క నిరుపేద దరఖాస్తు పెండింగ్‌లో ఉండకూడదు అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఐడీఓసీలో ఓ సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మార్చి 6న గ్రామసభలు నిర్వహించి, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను సకాలంలో పరిష్కరించాలనరు.

March 4, 2026 / 07:32 PM IST

రంగుల పండుగలో జగ్గారెడ్డి సందడి

SRD: సంగారెడ్డి పట్టణంలోని రాంనగర్ లో మాజీ MLA జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హోలీ సందడి కలర్ ఫుల్‌గా మారింది. ఆయన దరువు కొట్టినా.. తీన్మార్ స్టెప్పులు వేసినా.. అందరికంటే ఆయనే దిట్ట. ఇవాళ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్, పార్టీ నాయకులు, యువకులతో కలిసి రంగుల పండుగను జరుపుకున్నారు. రాంనగర్‌లో సాదాసీదాగా ఆయనకంటూ ప్రత్యేకతను చాటడమే కాకుండా, అందరినీ ఆకట్టుకున్నారు.

March 4, 2026 / 07:30 PM IST

మహిళా సమస్య భవన నిర్మాణానికి భూమి పూజ

NRPT: మర్కల్ మండలంలో మహిళా సమైక్య నిర్మాణానికి బుధవారం గ్రామ సర్పంచ్ చెన్నయ్య భూమి పూజ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పృధ్వీరాజ్, సూర్య మొహన్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:30 PM IST

రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

MDK: మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మాసాయిపేట మండలం పోతాన్ పల్లి గ్రామానికి చెందిన బర్రె చంద్రయ్య కుమారుడైన బర్రె విజయ్(25) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురైయ్యాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై చేగుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 4, 2026 / 07:29 PM IST

జిల్లా దిశ కమిటీ సభ్యుడిగా బోదులబండ సర్పంచ్

KMM: నేలకొండపల్లి మండలం బోదులబండ సర్పంచ్ కట్టెకోల నాగార్జునకు జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీలో సభ్యత్వం లభించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో జిల్లా కలెక్టర్ ఈ నియామకం చేపట్టారు. సర్పంచ్‌గా సేవలందిస్తున్న ఆయనకు జిల్లా స్థాయి కమిటీలో చోటు దక్కడంపై గ్రామస్థులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు.

March 4, 2026 / 07:27 PM IST

ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు: పొన్నం

SDPT: ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని ఆశించడం రాజకీయ పార్టీగా మా హక్కు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ మరో వ్యక్తి కాదని ప్రజలే న్యాయ నిర్ణీతలని ‘X’లో పేర్కొన్నారు.

March 4, 2026 / 07:27 PM IST

బాలసదనంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భువనగిరి మీనానగర్‌లోని బాలసదనాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల కోరిక మేరకు మ్యూజిక్ టీచర్ను నియమించాలని, పాడైన వాటర్ ఫిల్టర్ను వెంటనే బాగు చేయించాలని సూచించారు. విద్యార్థులకు కొత్త బెడ్ షీట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.

March 4, 2026 / 07:26 PM IST

హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

NGKL: మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆయన సతీమణి డాక్టర్ అనురాధ పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి దంపతులు ఉన్నారు.

March 4, 2026 / 07:25 PM IST

షాద్‌నగర్‌లో సినీనటి సందడి

RR: షాద్‌నగర్ పట్టణంలో “రంగు ఉత్సవ్” పేరిట నిర్వహించిన హోలీ వేడుకల్లో సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. హోలీ పండుగను పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణానికి సినీనటి రావడంతో హెబ్బాను చూసేందుకు స్థానికులు భారీగా తరలి రావడంతో ప్రాంతం కోలాహాలంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానికులు అందరితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

March 4, 2026 / 07:23 PM IST