• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈనెల 3న అడెల్లి పోచమ్మ ఆలయం మూసివేత

NRML: చంద్రగ్రహణం సందర్భంగా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ దేవస్థానాన్ని ఈనెల 3వ తేదీన మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు (ఒక్క గంట మాత్రమే) భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. తరువాతి రోజు బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, నిర్వహించిన అనంతరం యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.

March 1, 2026 / 07:07 PM IST

పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2000-01 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తమ పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

March 1, 2026 / 07:07 PM IST

‘బాధితున్ని బెదిరించిన కేసులో ఐదుగురు విలేకరుల అరెస్ట్’

ADB: బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన బాధితుడు బైరి వెంకటస్వామిని బెదిరించి రూ. 2 లక్షల వసూలు చేసిన ఘటనలో ఐదుగురు విలేకరుల అరెస్ట్ చేసినట్లు CI గురుస్వామి ఆదివారం తెలిపారు. ఈ మేరకు నిందితులు ప్రవీణ్, అజయ్ కుమార్, రాము, సతీష్, దినేష్ రెడ్డిపై కేసు నమోదైందని వెల్లడించారు. బాధితులు మోసపోతే నిర్భయంగా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు.

March 1, 2026 / 07:06 PM IST

ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ

HNK: మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌‌ను DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వాహనాల నిర్వహణలో సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 1, 2026 / 07:06 PM IST

5 నెలల పౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

ఖమ్మం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు SR&BGNR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. జాకీరుల్లా తెలిపారు. మొత్తం 535 మంది ధరఖాస్తు చేసుకోగా.. 268 మంది హాజరయ్యారని, 267 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

March 1, 2026 / 07:02 PM IST

చిరుత దాడిలో మరో లేగ దూడ బలి

KMR: గాంధారి మండలం రామలక్ష్మణపల్లి శివారులో సంగీయా నాయక్‌కు చెందిన లేగ దూడను శనివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది. శనివారం సాయంత్రం కొట్టంలో ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసే సరికి దూడ చనిపోయింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అడుగులను గుర్తించి చిరుత చంపిందని నిర్ధారించారు. బోన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

March 1, 2026 / 07:02 PM IST

అక్రమ ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

KNR: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు చేపట్టి రాకేష్ రెడ్డి, విజయ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 1, 2026 / 07:01 PM IST

‘విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుంది’

PDPL: విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుందని రామగిరి మండలం చందనాపూర్ గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చందనాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్నవరం, రామప్ప విహార యాత్రకు బయలుదేరగా జెండా ఊపి సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ ప్రారంభించారు.

March 1, 2026 / 07:01 PM IST

‘అమరుల త్యాగాలు చిరస్మరణీయం’

NGKL: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ నాయకులు స్మరించుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

March 1, 2026 / 06:59 PM IST

ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన

SRD: విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని,ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఓ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అధ్యయన కేంద్రంలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

March 1, 2026 / 06:57 PM IST

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MHBD: గూడూరు మండలం రాములు తండాకు చెందిన భానోత్ నరసింహ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు.

March 1, 2026 / 06:57 PM IST

తూడుకుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 06:49 PM IST

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని ముచ్చింపుల గ్రామంలో ఆదివారం రూ.10 లక్షల వ్యయంతో CC రోడ్ల నిర్మాణానికి MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంచి రహదారులు ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 06:48 PM IST

హసకొత్తూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్‌కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.

March 1, 2026 / 06:41 PM IST

‘మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రభుత్వం’

MNCL: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో ఆదివారం మహిళల సమస్యలు పరిష్కారాలు అంశంపై సదస్సు నిర్వహించారు. AIDWA రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశలత పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలు పోరాటంలోకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాన్నారు.

March 1, 2026 / 06:40 PM IST