MDCL: బోడుప్పల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్కు లేఖ అందజేశారు. భర్తీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.