MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం SC వర్గీకరణ పోరులో ప్రాణాలర్పించిన అమరవీరులకు MRPS నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS మండల అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగిన ఉద్యమం సాధించిన ఫలితాలను గుర్తుచేశారు.
WNP: రాజాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని కదిరేపాడులో నూతన విద్యుత్ ఫీడర్‌ను సర్పంచ్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇంతకుముందు పలు తండాలు, గ్రామాలకు ఒకే ఫీడర్ ఉండటంతో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తేవని తెలిపారు. కొత్త ఫీడర్‌తో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సాగులో ఇబ్బందులు తగ్గుతాయని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ADB: హిందూ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడమే సనాతన హిందూ ఉత్సవ సమితి లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. ఆదివారం గోపాలకృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు సమితిలో చేరారు. పట్టణంలో తమ సమితి ఒక్కటే ఉందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అనంతరం నూతన సభ్యులకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు.
MBNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MBNR టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. త్వరలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని ప్రకటించారు.
NRPT: సమాజంలో యువకులు చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి దేశ రక్షణకు ధర్మరక్షణకు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా ప్రచారక్ భార్గవ్ కోరారు. ఆదివారం ధన్వాడ జూనియర్ కళాశాల మైదానంలో 11 గ్రామాలకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు.దేశంలో హిందువులు మెజార్టీగా ఉంటేనే లౌకిక భావాలు కాపాడబడతాయన్నారు.
KMM: పెనుబల్లి సప్తగిరి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం కరాటే ఛాంపియన్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్ట రాగమయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు బాల్యం నుంచి కరాటే నేర్పించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అలాగే కరాటే నేర్చుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతోంది.
MDK: చేగుంటలో MRPS మండల అద్యక్షుడు కొలుపుల రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డల త్యాగంతో వర్గీకరణ సాధించుకున్నామని చాటుదామన్నారు.
MHBD: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ, ఆదివాసి మహిళా సంఘం ఆధ్వర్యంలో “ఆదివాసి మహిళ రాష్ట్ర” సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులతో కలిసి సదస్సు కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు.
HNK: పరకాల మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొచ్చు మహేందర్ మాతృమూర్తి బొచ్చు ఐలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్ మృతురాలి ఇంటికి వెళ్లి.. ఆమె పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెంలో సర్పంచి జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమంలో ఆదివారం నిర్వహించారు. ముంబాయ్ ఇన్ కామ్ టాక్స్ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. శ్రమదానం వల్ల గ్రామాలు శుభ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
MLG: వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సర్పంచులు గ్రామ అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టి వేగంగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
WGL: రాయపర్తి మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఐతరాజ్ మాదిగ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి ఘనంగా నివాళులర్పించామని పేర్కొన్నారు. మార్చి 1న అమరవీరులను స్మరించుకోవడం జరుగుతోందన్నారు.
SDPT: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘విజయీభవ’ ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవిత గతిని మార్చేది పదో తరగతేనని, మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐప్యాడ్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని ఆయన దీవించారు.
RR: ఈనెల 3వ తేదీన చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో 4వ తేదీన హోలీ పండుగ జరుపుకోవాలని షాద్‌నగర్ పండితులు రవి శర్మ తెలిపారు. అదేవిధంగా 3న చంద్రగ్రహణం నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు మూసివేయడం జరుగుతుందని, 3న మధ్యాహ్నం 3:20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6:47 నిమిషాల వరకు గ్రహణం ఉంటుందని వారు పేర్కొన్నారు.