• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సింగరేణి గనిలో ప్రమాదం కార్మికుడికి గాయాలు

PDPL: రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్ కట్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్ ఫాల్ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

February 25, 2026 / 09:11 AM IST

హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ స్కాలర్షిప్ రాట్లే. !

HYD: హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల స్కాలర్షిప్‌లు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రూ.750 చొప్పున 10 నెలలకు రూ.7,500 ఇవ్వాల్సి ఉండగా నిధులు విడుదల కాలేదని తెలిపారు. పెండింగ్ మొత్తాన్ని వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

February 25, 2026 / 09:10 AM IST

విద్యుదాఘాతంతో గేదె మృతి

SRPT: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేతు సోమయ్య చారికి చెందిన గేదెను ఇంటి నుంచి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తీగ తగిలి గేదె అక్కడిక క్కడే మృతిచెందింది.

February 25, 2026 / 09:10 AM IST

రూ.280 కోట్లతో ఉస్మాన్ సాగర్ నుంచి కొత్త పైప్ లైన్

HYD నగరానికి జంట జలాశయాలు మంచినీటి వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. 1920 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించారు. కాలక్రమేణా మరమ్మత్తులు పెరగడంతో లీకేజీలు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.280 కోట్ల వ్యయంతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

February 25, 2026 / 09:09 AM IST

తహశీల్దారుకు రైతుల వినతి పత్రం అందజేత

KNR: అసంపూర్తిగా నిలిచిపోయిన డీ-8 ఉప కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నీటిని అందించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత రైతులు తహసీల్దార్ కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపోయామన్నారు. కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగక పంటలకు నీరు అందడం లేదని, అన్నారు.

February 25, 2026 / 09:08 AM IST

‘డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా’

MBNR: కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని డివిజన్ కార్పొరేటర్ గూండా సంతోష్ అన్నారు. మంగళవారం రాత్రి డివిజన్‌కు సంబంధించిన నాయి బ్రాహ్మణ కాలనీ ప్రజలు కార్పొరేటర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

February 25, 2026 / 09:07 AM IST

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం: అదనపు కలెక్టర్

ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:06 AM IST

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం

ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:06 AM IST

ఈనెల 28న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు రాక

ASF: జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 28న తిర్యాణి మండలంలో పర్యటించనున్నట్లు BJP మండల అధ్యక్షుడు సారా రమేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ సభ్యుడు పర్యటనలో భాగంగా మండలంలోని మంగి గ్రామాన్ని సందర్శించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోని రోడ్లు, పోడు భూముల సమస్య, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:05 AM IST

త్వరలోనే హాస్పిటల్ ప్రారంభం: మంత్రి

WGL: త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మొత్తం 35 డిపార్ట్‌మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నామని, ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

February 25, 2026 / 09:05 AM IST

నేడు డబుల్ బెడ్ రూమ్‌ల పంపిణీ

RR: ఇవాళ షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని బండకుంట తండా, ధన్‌సింగ్ తండా, చాకలిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తూరు, నందిగామ మండల పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.

February 25, 2026 / 09:04 AM IST

‘వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నాం’

MNCL: వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నామని మంచిర్యాల ట్రాఫిక్ CI సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.

February 25, 2026 / 09:03 AM IST

కుమ్మెర జాతర ఘటనలో ముగ్గురు అరెస్ట్

NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1 ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి, A2 మధు రెడ్డి, A3 శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల చిన్నారి మృతదేహంపై పోస్టుమార్టం నివేదికలో అంతర్గత, బహిర్గత గాయాలు లేవని వెల్లడైంది. RFSL నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

February 25, 2026 / 09:02 AM IST

మహిళా డిగ్రీ కళాశాల అడ్మిషన్‌లు ప్రారంభం

MBNR: దొడ్డలోనిపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కొత్త విద్యార్థుల అడ్మిషన్‌లు  ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ Dr. జె.జయప్రద తెలిపారు. అభ్యర్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 09:00 AM IST

నర్సరీలను సందర్శించిన చైర్మన్ రాఘవరెడ్డి

HNK: అశ్వరావుపేట, దమ్మపేట, కల్లూరి గూడెం ప్రాంతాలలో ఆయిల్ ఫామ్ నర్సరీలను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం పరిశీలించారు. నాణ్యమైన మొక్కలను రైతులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని, ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

February 25, 2026 / 08:59 AM IST