• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్‌తో కలిసి భూమిపూజ చేశారు. రూ. 80 లక్షలతో సిబ్బంది గృహాలు రూ. 21లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1

February 27, 2026 / 02:02 PM IST

ఎల్లారెడ్డి మండల పంచాయతీ అధికారిగా ప్రభాకర చారి

KMR: నాగిరెడ్డిపేట్ మండలంలో మండల పంచాయితీ అధికారిగా విధులు నిర్వర్తించిన ప్రభాకర చారి డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి మండలానికి వచ్చారు. ఎల్లారెడ్డి మండలంలో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన ఏ.ప్రకాష్ నాగిరెడ్డిపేట మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు అధికారులకు ఉన్నత అధికారులు డిప్యూటేషన్‌పై నియమించారు.

February 27, 2026 / 02:02 PM IST

అక్రమ ఇసుక తరలింపు.. రెండు ట్రాక్టర్ల సీజ్

KNR: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. కాచాపూర్ గ్రామ శివారులో వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన సంఘీ రాజు, నేదురు కనకయ్యలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు.

February 27, 2026 / 02:01 PM IST

‘కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి’

SRPT: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో దళితులపై దాడి చేసి, రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసిన నిందితులను ఉరితీయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలో ఇంతటి అమానుషం జరిగినా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు.

February 27, 2026 / 02:01 PM IST

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ బాధ్యతలు స్వీకరణ

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా స్థానిక సంస్థల పనితీరును మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలులో పారదర్శకత ఉండేలా కృషి చేస్తానని చెప్పారు.

February 27, 2026 / 01:52 PM IST

పాలమూరు యూనివర్సిటీలో రవికుమార్ నియామకం

MBNR: పాలమూరు యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్ నోడల్ ఆఫీసర్గా డాక్టర్ యస్. రవికుమార్ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేశ్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ నియామకం చేపట్టబడిందని యూనివర్సిటీ వెల్లడించింది. తోటి అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.

February 27, 2026 / 01:50 PM IST

‘ముదిరాజులను ఆదుకోవాలి’

NRPT: ముదిరాజులను బీసీ డీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపులోకి మార్చాలని పాలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ప్రభుత్వం ముదిరాజులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందు, మొగులప్ప, నారాయణ, చంద్రశేఖర్, పటేల్ శీను ఉన్నారు.

February 27, 2026 / 01:45 PM IST

మెదక్ కలెక్టర్‌ను కలిసిన రామాయంపేట తహసీల్దార్

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి, ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పాలనాపరమైన అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తహసీల్దార్ వివరించారు.

February 27, 2026 / 01:43 PM IST

భద్రాద్రిలో ఘనంగా నిత్య కల్యాణం

BDK: భద్రాద్రి రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కళ్యాణం జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

February 27, 2026 / 01:40 PM IST

లోన్ యాప్ వేధింపులు.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య

MDCL: ఘట్‌కేసర్‌లో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మరో వ్యక్తి ప్రాణం తీశాయి. భార్య పేరుతో లోన్ యాప్‌లో రుణం తీసుకున్న ఆటో డ్రైవర్ సాయికుమార్ (35), సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్ల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. భార్య ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

February 27, 2026 / 01:39 PM IST

పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారం

BDK: మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలో నిర్మించబడిన ఇందిరమ్మ నూతన ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు షేక్ యాకూబీ, ఎస్.కే.బి.బి., మర్రిశెట్టి లక్ష్మీ, తిరుపతమ్మ కుటుంబాల నూతన గృహాల్లో గృహప్రవేశ పూజల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 27, 2026 / 01:37 PM IST

మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

HYD: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నిజాంపేట్ మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పాల్గొన్నారు.

February 27, 2026 / 01:36 PM IST

ఇంటర్ పరీక్షకు 27 మంది గైర్హాజరు

VKB: కుల్కచర్ల మండలంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రామలింగేశ్వర డిగ్రీ కళాశాలలో 228 మంది విద్యార్థులకు గాను 222 మంది హాజరవ్వగా, 6గురు గైర్హాజరయ్యారు. అలాగే వివేకానంద జూనియర్ కళాశాలలో 294 మందికి గాను 274 మంది హాజరయ్యారని, 20 మంది విద్యార్థులు రాలేదని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 01:35 PM IST

వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దశమ వార్షికోత్సవ కళ్యాణానికి హాజరుకావాలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం సభ్యులు కోరారు.

February 27, 2026 / 01:35 PM IST

ఎంఈవోపై అదనపు కలెక్టర్ ఆగ్రహం

KMM: ముదిగొండ MEO రమణయ్యపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ముదిగొండ మండలం రాఘవపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై MEOను ప్రశ్నించారు. పాఠశాలలో ఐదుగురు సిబ్బంది ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోతున్నారని చెప్పారు. తాను మళ్లీ వచ్చేనాటికి పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉండాలన్నారు.

February 27, 2026 / 01:35 PM IST