»Minister Sabita Indra Reddy Reaction On Paper Leake
Sabhita Indra Reddy : పదోతరగతి పరీక్షా పేపర్ లీక్…. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆరా..!
Sabhita Indra Reddy : ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న తెలుగు పేపర్, హిందీ పేపర్ లు లీక్ అయ్యాయంటూ వార్తలు వచ్చాయి. కాగా... దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.
ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న తెలుగు పేపర్, హిందీ పేపర్ లు లీక్ అయ్యాయంటూ వార్తలు వచ్చాయి. కాగా… దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.
నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్ష మొదలు కాగా.. ఏడు నిమిషాల తర్వాత (9.37 నిమిషాలకు) వాట్సాప్లో ప్రశ్నాపత్రం లీక్ అయింది. పలు వాట్సాప్ గ్రూపులలో టెన్త్ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టడంతో అందరూ షాక్ అయ్యారు. తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో ఇన్విజిలేటర్లు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చారు. ఇక ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. హిందీ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ అయినట్లు పేర్కొంటున్నారు. వరుస పేపర్ల లీక్ తో విద్యార్థులు, తల్లిదందడ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. హిందీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై అధికారలను ఆరా తీశారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని వివరించారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు.