మధ్యాహ్న భోజన పథక వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసం శ్రీనగర్ కాలనీ వద్ద వంట కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు, కార్మికులు కలిసి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వేతన సవరణ జీవో నెంబర్. 8 ను మంత్రి సబితా చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు మాట్లాడుతూ.. నూతన వేతన సవరణ ద్వారా 52,250 మంది వంట కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.1000 మాత్రమే అందించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 కి అదనంగా మరో 2000 కలిపి రూ.3000 గౌరవ వేతనంగా పెంచారని అందుకు వంట కార్మికుల తరపున కేసీఆర్ కి, మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.