10th Exams : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవ్వడం తీవ్ర దుమారం రేపాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవ్వడం తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో… పదో తరగతి పేపర్ కూడా లీక్ అయ్యిందనే విషయం మరింత దుమారం రేపింది. అయితే… ఈ వార్త పై వికారాబాద్ డీఈవో రేణుక దేవి రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షకు ముందే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఎలాంటి పేపర్ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ 2023 ఎగ్జామ్స్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రేణుక దేవి చెప్పారు.
మొబైల్ ఫోన్స్ పూర్తిగా నిషేధించామని, తాను 4 పరీక్షా కేంద్రాలు విజిట్ చేసి వచ్చానని వివరించారు. తనకు పేపర్ లీకేజీపై ఎలాంటి సమాచారం రాలేదని, తన ఫోన్ కు కూడా ఎలాంటి పేపర్ రాలేదని స్పష్టం చేశారు. కానీ ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ గానీ, కంప్లైంట్స్ గానీ రాలేదన్నారు పేర్కొన్నారు డీఈవో రేణుక దేవి.
ఈ వివాదంపై ఇంటలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వికారాబాద్ కలెక్టరేట్లో డీఈవో, విద్యాశాఖ అధికారులు సమావేశం అయ్యారు. ఆ తర్వాత డీఈవో హుటాహుటిన కలెక్టరేట్ కు వెళ్లినట్టు సమాచారం అందుతోంది.