Minister Puvvada Ajay Invite Junior NTR unveil NTR Statue
Minister Puvvada Ajay:స్వర్గీయ ఎన్టీఆర్ (ntr) శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన మనమడు జూనియర్ ఎన్టీఆర్ (ntr) మాత్రం ఎక్కడ కనిపించలేదు. అతనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) తారక్‌ను కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఖమ్మం (kammam) జిల్లా లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ (ntr) 54 అడుగుల విగ్రహాం నెలకొల్పారు. ఈ నెల 28వ తేదీన ఆవిష్కరించాల్సి ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) తారక్‌ను కలిసి.. విగ్రహావిష్కరణకు రావాలని కోరారు. ఎన్టీఆర్ వారసుడిగా తారక్‌ను గుర్తించి.. ఇన్వైట్ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ను (lokesh) పిలిచే సిచుయేషన్ లేదు. టీడీపీతో బీఆర్ఎస్కు అంత పొసగదు. దీంతో మరొకరిని పిలవాలి.. అందుకే తారక్‌ను పిలిచారని అనేవారు కొందరు ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ (ntr) కూడా గతంలో టీడీపీ కోసం పనిచేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున రోడ్ షో చేశారు. ఆ ప్రచారంలో గాయపడి ఆస్పత్రిలో చేరారు. తర్వాత ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ తారక్ రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో ప్లెక్సీలు వెలుస్తాయి. ఈ పరిణామం తండ్రి, కొడుకులను ఇబ్బందికి గురిచేసింది. తారక్‌కు టీడీపీలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీ కూడా తారక్‌ను గౌరవిస్తారు.