Ukraine attempted to assassinate Putin:ఉక్రెయిన్‌పై రష్యా (russia) సంచలన ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడు పుతిన్‌ను (Putin) హత్య చేసేందుకు ప్రయత్నించిందని తెలిపింది. పుతిన్ (Putin) కార్యాలయం క్రెమ్లిన్‌లో రెండు డ్రోన్లతో (drones) ఉక్రెయిన్ దాడికి దిగిందని చెప్పింది. ఆ డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. క్రెమ్లిన్‌పై డ్రోన్లు దాడి చేసిన సమయంలో పుతిన్ (Putin) అక్కడ లేరని పేర్కొంది. ఈ మేరకు ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది. వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
BREAKING: The Kremlin has reportedly been attacked by at least 2 drones.
Russia now claims that the attacks were an assassination attempt on President Vladimir Putin.
The Two drones (One which can be seen in the video below) exploded behind the Kremlin walls.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం రష్యా యుద్దానికి దిగింది. ఉక్రెయిన్ అగ్రారాజ్యం అమెరికా సపోర్ట్ చేసింది. యుద్ధం సమయంలో భారత్ సహా ఇతర దేశాల్లో వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కుట్రను భగ్నం చేశామని.. దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నారని రష్యా పేర్కొంది. రష్యా చేసిన ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపాయి. ఉక్రెయిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రష్యా హెచ్చరికలు జారీచేసింది. ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది.
According to Russian media, two unidentified drones were targeted at the Kremlin last night.
"As a result of their fall and scattering of fragments, there were no victims and material damage. President of Russia was not injured as a result of Ukrainian attack" – Putin's office… pic.twitter.com/w7Bv1jQzYk
— Anton Gerashchenko (@Gerashchenko_en) May 3, 2023