IT Raids At Minister Malla Reddy Followers Residence
Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి (Malla Reddy) నోటి దురుసు కాస్త ఎక్కువే అని మరోసారి రుజువు అయ్యింది. ఆడటం, పాడటమే కాదు.. అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. సందర్భం కాకున్నా ఏదో ఇష్యూ మాట్లాడి.. కాంట్రవర్సీ చేస్తుంటారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ హోం మంత్రి మహమూద్ అలీ (Mahamood ali), డీజీపీ అంజనీకుమార్ (anjani kumar) ఆశీనులయ్యారు. అక్కడ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
కార్యక్రమం గురించి వదిలేసి పోలీసుల (police) గురించి మాట్లాడారు. పోలీసులకు పొట్ట (stomach) ఉంటుందని, అలా అయితే కష్టం అన్నారు. పోలీసులు ఫిట్‌గా ఉండాలని.. వారిని చూస్తేనే దొంగలు భయపడిపోవాలని అన్నారు. బొజ్జ (stomach) ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని అన్నారు. అంతేకాదు ఖాకీలు (police) ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలో జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ పోలీసులు (police) దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) గుర్తుచేశారు. మన పోలీసులు (police) చక్కగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం త్వరగా జరుగుతోందని తెలిపారు. సో.. పోలీసులు మంచి ఫిట్‌గా ఉండాలని కోరారు. అందుకే పొట్ట తగ్గించుకోవాలని.. తనని చూడాలని ఎలా ఉన్నానని అక్కడే ఉన్న మహమూద్ అలీ, డీజీపీని అడిగారు.
మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. పోలీసుల గురించి ఇలా మాట్లాడటంపై కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, నేతల భద్రత కోసం పనిచేస్తాం అని.. నిరంతరం డ్యూటీలో ఉంటామని చెబుతున్నారు. తమను ఇలా అనడం బాధించిందని కొందరు పోలీసుల (police) నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.