»Super Fast Railway Line Survey Soon In Telugu States
Good News: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వే, ఏ రూట్లు అంటే..?
ఏపీ, తెలంగాణల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో సర్వే జరగనుంది . ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
Super Fast Railway Line Survey Soon In Telugu States
Good News: ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు (Super Fast Railway Line) రైల్వే బోర్డు (Railway Board) అంగీకారం తెలిపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) చొరవ తీసుకోవడంతో సర్వే జరగనుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కోరారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు రూట్లలో ఈ సర్వే జరగనుంది. దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ రాసింది. రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు ప్రవేశపెట్టేందుకు వీలుగా అవసరమైన టెక్నికల్ ఫీజబిలిటీనీ సర్వే ద్వారా నిర్ణయిస్తారు.
రెండు లైన్ల పరిధిలో కలిపి మొత్తం 942 కిలోమీటర్ల ఉంటుంది. ఈ మార్గంలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్ (railway line) నిర్మాణానికి అసవరమైన సర్వే నిర్వహిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (vande bharath express) సేవలు అందుతోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణం, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైళ్ల సేవలను జనం పొందుతున్నారు. ఈ కొత్త రైల్వే లైన్లతో ప్రయాణం మరింత సులువు కానున్నాయి.