హైదరాబాద్లో మెట్రో రైలు మరోసారి సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఎల్బీనగర్- మియాపూర్ కారిడార్లోని ఎర్రమంజిల్ లో మొరాయించింది. దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలులో తరిలించారు.ప్రధాన రవాణ సాధనల్లో ఒకటైన మెట్రో తరుచుగా ఆటంకాలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందికి గురివుతున్నారు. సాంకేతిక సమస్యలతో రైళ్లు గమ్యస్థానాలకు చేరకముందే నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా ఇతర రైళ్ల సర్వీసులూ ఆగిపోతున్నాయి. ట్త్రేన్ లో టెక్నికల్ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.