తెలంగాణ(Telangana)లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) వెల్లడించింది. మే 7వ తేదిన పలు జిల్లాల్లో వర్షాలు(Rain) పడతాయని, అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఆదివారం సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. మే 8న సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
మే 7వ తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad Weather Department) అధికారులు వెల్లడించారు. అల్పపీడనం మే 8న వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో మోచా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు వెల్లడించారు.