కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరగడంతో స్టీల్ ప్లేట్లు వేస్తారు. 6 నెలల విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
KCR Orders BRS subsidiary Union Not Contest In Singareni Elections
KCR: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) నిన్న అర్ధరాత్రి గాయపడిన సంగతి తెలిసిందే. వాష్ రూమ్ వెళ్లి కాలు జారి పడిపోయారు. దీంతో ఎడమ తుంటి ఎముక రెండు చోట్ల విరిగింది. వెంటనే యశోధ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు పరిశీలించి సర్జరీ అవసరం అని.. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్ కంట్రోల్ చేసిన తర్వాత సర్జరీ నిర్వహిస్తారు. కేసీఆర్ (KCR) కోలుకోవడానికి 6 నెలల సమయం పడుతుందని యశోద వైద్యులు తెలిపారు. కేసీఆర్ (KCR) గాయపడి ఆస్పత్రిలో చేరగా.. అక్కడ ఎంపీ సంతోష్ రావు ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత వచ్చి అక్కడే ఉన్నారు.
BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon. Grateful for all the love 🙏🏼
కేసీఆర్ చికిత్స చేసుకుంటున్న ఆస్పత్రి వద్ద భద్రతను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ప్రొటెక్షన్ పెంచారు. కేసీఆర్ గాయపడిన విషయం తెలసుకొని ప్రధాని మోడీ స్పందించారు. గాయం గురించి తెలిసి బాధపడ్డానని వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.