ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి మాట్లాడుతూ…బండి సంజయ్ ఎమోషనల్ అయ్యి.. కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ ఘటనపై తాజాగా… ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు అని ప్రశ్నించిన ఆమె మన మంత్రులు ఈడీ, ఐటీ పిలిస్తే పోతున్నారు కదా అని అన్నారు. కానీ రాముడి పేరు చెప్పి బీజేపీ వాళ్లు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని, అదే వాళ్ళ నేత బీఎస్ సంతోష్ విచారణకు రమ్మంటే కోర్టుకెళ్లారని అన్నారు.
ఆయన సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడం లేదని, నిన్న సభ పెట్టి బండి సంజయ్ ఏడ్చాడు, మరి తప్పు చేయకపోతే భయమెందుకు? అని ఆమె ప్రశ్నించారు. ఈడీ, ఐటీ దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరన్న ఆమె విచారణ చేసుకోండి.. అన్ని పత్రాలు చూపిస్తామన్నారు. రాజకీయంగా గట్టిగా ఉన్నవాళ్లను గద్దల్లా ఎత్తుకు పోతున్నారని అన్నారు. ఇక మరో పక్క సిట్ విచారణకు బి.ఎల్.సంతోష్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ జరిగిందో. సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశించాలని కోర్టును ఏజీ కోరారు.
ఈనెల 20న నోటీసులు అందినా హాజరుకాలేదని ఏజీ తెలిపారు. సంతోష్ విచారణకు వచ్చేలా చూసే బాధ్యత పిటిషనర్‌పై ఉందని కోర్టు పేర్కొంది. నిర్దిష్ట తేదీతో మరో 41ఏ నోటీసు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏజీ కోరారు. ఈ క్రమంలో సంతోష్‌కు హైకోర్టు మరో నోటీసు జారీ చేయాలని సిట్‌ను ఆదేశించింది. అలాగే ఆయన ఈ మెయిల్ ఐడీకి కూడా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాత తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.