జనగామ డీసీసీ (Janagaam DCC) అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (Janga Raghav Reddy) టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్లో(Gandhi Bhavan) జరిగిన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు.
జనగామ డీసీసీ (Janagaam DCC) అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (Janga Raghav Reddy) టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో(Gandhi Bhavan) జరిగిన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ను బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్కు అనుకూలంగా రాజకీయ పరిస్థితిని మారుస్తున్నారంటూ ఇటీవల హన్మకొండ డీసీసీ (Hanmakonda DCC) అధ్యక్షుడు నాయిని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్యర్తో (MLA Dasyan Vinay Bhasyar) కలిసి తనకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు అతికించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన అనుమతి లేకుండా హన్మకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, అతడికే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి (Rajender Reddy) ఫైర్ అయ్యారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు(showcase notices) కూడా ఇచ్చారని నాయిని గుర్తు చేశారు. అతడితో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని జంగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి తెలిపారు. తాజాగా పార్టీ క్రమశిక్షణ చర్యలకు దిగడంతో జంగా వైఖరి ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠ ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతుండగా, నోటీసులు ఇవ్వడమంటే ఆయన్ను కట్టడి చేసేందుకు అధిష్ఠానం నిర్ణయించుకుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నోటీసులపై జంగా రియాక్టవుతారా..? లేదా అన్నది వేచి చూడాలి.