»Tenet Exams From Today 4 94 Lakh Students Are Going To Appear
నేటి నుంచి టెన్త్ పరీక్షలు…రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు
తెలంగాణలో (Telanagana) నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్(Tenth Exams) జరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. విద్యార్థులు (Students) పరీక్షా కేంద్రాలకు గంట ముందే రావాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో (Telanagana) నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్(Tenth Exams) జరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. విద్యార్థులు (Students) పరీక్షా కేంద్రాలకు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ (144 section) విధించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో CC కెమరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించానున్నారు.మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కాగా, 98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు.
పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా, ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్(chief superintendent), డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు సహా పరీక్ష హాల్లో ఎవరూ మొబైల్(mobile) వాడానికి కానీ, తీసుకెళ్లేందుకు కానీ అనుమతి లేదు. పేపర్‌ను లీక్ చేసే అవకాశం ఉన్న ఎలాంటి పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అంతేకాదు, ఆయా పాఠశాలల కరస్పాండెట్లను కూడా అనుమతించబోమని విద్యాశాఖ(education department) స్పష్టం చేసింది. కాపీయింగ్ కనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు (invigilators), ఎంఈవోలు, డీఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమస్యలపై ఫిర్యాదు(complaint) చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద ఎంఈవో, డీఈవో(DEO) నంబర్లను అందరికీ కనిపించేలా రాయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక, కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ‘పది’ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా(free in rtc buses) ప్రయాణించవచ్చు.