తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్లికేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా ఆశావహులు హైదరాబాద్లోని గాంధీభవన్(Gandhi Bhavan)కు పోటెత్తారు. నిన్నటివరకు 700 పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈరోజు వచ్చే అప్లికేషన్ల(applications)తో కలిపి వెయ్యికి చేరే అవకాశం కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో 10 నుంచి 15 దాకా అప్లికేషన్లు వచ్చాయి. మరోవైపు ఒక్కో నేత ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓకే కుటుంబ నుంచి వేర్వేరుగా దరఖాస్తు చేస్తున్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి అప్లికేషన్ దాఖలు చేశారు.
కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అప్లై చేశారు.కాంగ్రెస్ సీటు కోసం సినీ నిర్మాత అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. హుజూర్ నగర్ (Huzur Nagar), కోదాడ నియోజకవర్గాల టికెట్ కోసం జార్జి రెడ్డి సినిమా నిర్మాత అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అప్పి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాలు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అప్పి రెడ్డి (Appi Reddy) దరఖాస్తు చేసుకున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పి రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఉత్తమ్ దంపతులు పోటీ చేసినా మద్దతు ఇస్తానని, తనకు అవకాశం ఇచ్చినా తాను పోటీ చేస్తానని చెప్పారు.రానున్న ఎన్నికల్లో తాను కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నానని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ(Survey Satyanarayana) అన్నారు. చాలా రోజుల తర్వాత శుక్రవారం ఆయన గాంధీ భవన్కు వచ్చారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ లోక్ సభ నుండి గెలిచిన మధుయాష్కీ (Madhuyashki0 ఈసారి ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి నుండి ఆయన దరఖాస్తు చేశారు. హుజూరాబాద్ నుండి బల్మూరి వెంకట్, , మధిర నుండి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) దరఖాస్తు చేసుకున్నారు.