»A Person Who Poured Petrol On A Passenger In A Train
Kannur Express : ట్రైన్లో ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి
కేరళలో దారుణం జరిగింది. ఇద్దరు రైలు (Train) ప్రయాణికుల మధ్య గొడవ తలెత్తంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్ (passenger)పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అళపుజ కన్నూర్ ఎక్స్ప్రెస్ ( Alappuzha Kannur Express) రైల్లో ఈలాతూర్ (eelathur)వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడిని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు రంగంలోకి దిగి ట్రైన్లో చైన్ లాగారు.
కేరళలో దారుణం జరిగింది. ఇద్దరు రైలు (Train) ప్రయాణికుల మధ్య గొడవ తలెత్తంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్ (passenger)పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అళపుజ కన్నూర్ ఎక్స్ప్రెస్ ( Alappuzha Kannur Express) రైల్లో ఈలాతూర్ (eelathur)వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడిని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు రంగంలోకి దిగి ట్రైన్లో చైన్ లాగారు. బాధితుడు (victim) మంటల ఆర్పే క్రమంలో ఉన్న కొందరికి గాయాలయ్యాయి. అయితే.. చైన్ లాగాక రైలు నెమ్మదిస్తున్న తరుణంలో నిందితుడు బోగి దిగి పారిపోయాడు. బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన వారిలో కొందరికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. రైల్లోని డీ1 కంపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందికి గాయాలు కాగా బాధితులను ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.