వందే భారత్ రైలుపై(Vande Bharat Train) మరోసారి రాళ్ల దాడి (Stone attack) జరిగింది. సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ట్త్రెన్ పై రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు.
వందే భారత్ రైలుపై (Vande Bharat Train) మరోసారి రాళ్ల దాడి (Stone attack) జరిగింది. సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ట్త్రెన్ పై రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖకు వందే భారత్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్ల దాడిలో రైలు C-8 కోచ్‌లో అద్దం పగిలిందని అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. గడిచిన మూడు నెలల్లో ఇటువంటి దాడులు జరగడం ఇది మూడో సారి. ఈ ఘటనతో ఇవాళ వైజాగ్ (Vizag) నుంచి వచ్చే ట్రైన్ (Train) ఆలస్యంగా బయలుదేరింది. విశాఖ నుంచి ఉదయం 5:45 కు సికింద్రాబాద్‌కు బయలు దేరాల్సిన ట్రైన్ 9:45కు స్టార్టయ్యింది.
దీంతో ప్రయాణికులను సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) అలర్ట్ చేసింది. మామూలుగా సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. కానీ ఈరోజు సాయంత్రం 7 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలిపింది. దాని పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నందున ఈ ట్రైన్ కూడా లేటుగా బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, ట్రైన్లపై రాళ్ల దాడికి పాల్పడే వారిని గుర్తించి రైల్వే యాక్ట్‌లోని కఠిన సెక్షన్లు పెట్టాలని అధికారులు డిసైడయ్యారు. తాజాగా ట్రైన్‌పై దాడి చేసిన వారిని సీసీ ఫుటేజ్(CCTV footage) ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారి కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) తీవ్రంగా గాలిస్తోంది. పగిలిన కోచ్ అద్దం విలువ దాదాపు రూ. లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.