Heavy rains : మరో రెండు రోజులు దంచి కొట్టనున్న వర్షాలు
తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre)హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానాలు (rains) కూరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre)హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానాలు (rains) కూరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల వడగళ్లు కురుస్తాయని చెప్పింది. అలాగే ఉత్తర, మధ్య తెలంగాణ (Telangana) జిల్లాలైన ఆసిఫాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో శక్తివంతమైన క్యుములోనింబర్ మేఘాలు ఏర్పడ్డాయని.. రానున్న రెండు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వివరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఏపీ కోస్తా తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనితో పాటు విదర్భ నుంచి తెలంగాణ వరకు సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో 7వ తేదీ లేదా ఆ తర్వాత బంగాళాఖాతంలో (Bangalakhatam) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.