»Better To Show Film Balagam To The Police With Bandi Sanjayaparna
bandi aparna:సంజయ్‌తో పోలీసులకు బలగం సినిమా చూపిస్తే బాగుండేది
పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను భార్య అపర్ణ ములాఖత్ సందర్భంగా కలిశారు..
better to show film Balagam to the police with Bandi sanjay:aparna
bandi aparna:పదో తరగతి హిందీ పేపర్ (hindi paper leak) లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) కరీంనగర్ జైలులో (karimnagar jail) రిమాండ్ ఖైదీగా (remand prisoner) ఉన్నారు. భార్య అపర్ణ (aparna) ములాఖత్ సందర్భంగా సంజయ్‌ను కలిశారు. తనతోపాటు పోలీసులకు (polie) బలగం సినిమా (balagam) చూపిస్తే బాగుండు అని బండి సంజయ్ (bandi sanjay) తనతో అన్నారని అపర్ణ (aparna) తెలిపారు. దీంతోనైనా వారికి ఫ్యామిలీ ఎమోషన్స్ అర్థమయ్యేవి అని తెలిపారు.
ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ (modi) హైదరాబాద్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రోజు తను సభకు హాజరుకాలేనని తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు వెళ్లి సభకు విజయవంతం చేయాలని కోరారని తెలిపారు. సంజయ్ (sanjay) రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఈ లోపు సంజయ్‌కు బెయిల్ వచ్చే అవకాశం లేదు.
పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ (bandi sanjay) మొబైల్ కీలకంగా మారింది. సంజయ్ (sanjay) ఫోన్ ఎక్కడ ఉందో తమకు తెలియదని ఆయన సతీమణీ అపర్ణ (aparna) వివరించారు. అరెస్ట్ చేసే సమయంలో కూడా ఫోన్ మాట్లాడారని.. తోపులాటలో పడిపోయి ఉంటుందని తెలిపారు. మొబైల్ ఎవరి వద్ద ఉందో పోలీసులకే (police) తెలియాలని అంటున్నారు. సంజయ్ (sanjay) హెల్త్ సరిగ్గానే ఉందని.. మెడిసిన్ వేసుకుంటున్నారని అపర్ణ తెలిపారు.