Hyderabad:హైదరాబాద్లో (Hyderabad) మళ్లీ వాన కురుస్తోంది. బంజారాహిల్స్ (banjara hills), జూబ్లీహిల్స్ (jubilee hills) ప్రాంతంలో కుండపోతగా వాన పడుతోంది. ఇతర చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. కుత్బుల్లాపూర్లో (quthbullapur) చిన్న చిన్న రాళ్ల వాన పడుతుంది.
ఈ రోజు ఉదయం ఉక్కపోసింది. ఎండ కూడా ఎక్కువే ఉంది. మధ్యాహ్నం 1.40 గంటల నుంచి వాతావరణం మారిపోయింది. నాచారం (nacharam), మల్లాపూర్ (mallapur), తార్నాక (tarnaka), ఓయూ క్యాంపస్ (ou campus), లాలాగూడ (lalaguda), అబిడ్స్ (abids), నాంపల్లి (nampally), కోఠి (koti), సుల్తాన్ బజార్ (sultan bazar), బేగం బజార్ (begum bazar) తదితర చోట్ల వర్షం కురుస్తోంది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ రోజు హనుమాన్ జయంతి కావడంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. వర్షం వల్ల శోభాయాత్రకు ఆటంకం కలిగింది. వర్షం వల్ల ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది.
శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ నిన్ననే వెల్లడించింది. రెండు రోజులు పగటిపూట ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియనస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో సిటీకి ఎల్లో అలర్ట్ (yellow alert) జారీచేశారు.