Raja singh బర్త్ డే.. తన పేరు హనుమాన్ సింగ్ అంటూ.. అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు సిటీలో ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Raja singh:గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను (Raja singh) పోలీసులు (police) అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు సిటీలో ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్‌ను (Raja singh) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదని రాజా సింగ్ (Raja singh) అన్నారు.
ఈ రోజు తన పుట్టిన రోజు (birthday) అని రాజా సింగ్ (Raja singh) తెలిపారు. తన అసలు పేరు హనుమాన్ సింగ్ (hanuman singh) అని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయనను పోలీసులు (police) వదల్లేదు. ఓ పోలీస్ అధికారి.. షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశారు. కానీ ముందస్తుగా అరెస్ట్ (arrest) చేశారు. ఆ తర్వాత ఓ వీడియోను రిలీజ్ చేశారు.
హనుమాన్ జయంతికి తన నియోజకవర్గంలో బైక్ ర్యాలీ (byke rally) జరుగుతుందని రాజా సింగ్ (Raja singh) పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి భక్తులు విధ్వంసానికి పాల్పడితే తనకు సంబంధం లేదన్నారు. తనను అరెస్ట్ (arrest) చేస్తే హనుమాన్ భక్తులు ఆవేశానికి లోనవుతారని.. దానికి తనకు సబంధం లేదన్నారు.
శ్రీరామనవమి (sri ram navami) సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారని రాజా సింగ్‌పై (Raja singh) కేసు ఫైల్ అయ్యింది. అప్పుడు కూడా అరెస్ట్ (arrest) చేశారు. ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టేలా ప్రసంగిస్తారని.. ఈ రోజు హనుమాన్ శోభయాత్రలో (hanuman shobhayatra) ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు.