TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ & ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో లింగ వివక్షతపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ ఇనీక్వాలిటీస్ ఇన్ భరత నాట్యం ట్రెడిషనల్ ఫార్మ్ ఇతి వృత్తంగా సదస్సు జరుగుతుందని తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు హాజరు కావచ్చన్నారు.