BRS Mla Chinnaiah Victim Shejal Suicide Attempt At Delhi
Mla Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని ఢిల్లీలో గత నాలుగు రోజుల నుంచి ఆరిజన్ డెయిరీ పాల కంపెనీ భాగస్వామి షెజల్ ఆందోళన చేస్తోంది. తెలంగాణ భవన్ వద్ద ఈ రోజు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పక్కన ఉన్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Mla Chinnaiah) తనను వేధిస్తున్నాడని షెజల్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
దుర్గం చిన్నయ్య (Mla Chinnaiah) తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని షెజల్ ఆందోళన చేస్తున్నారు. ఆయనపై జాతీయ మావన హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తర్వాతి రోజు నుంచి ఢిల్లీలో గల తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఆమె ఆందోళన కొనసాగుతోంది. ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
షెజల్ సూసైడ్ లేఖ కూడా రాశారు. అందులో దుర్గం వేధిస్తున్నట్లు ఆరోపించారు. అతని అనుచరులు కూడా టార్గర్ పెడుతున్నారని అందులో పేర్కొన్నారు. తనను చంపేస్తానని దుర్గం చిన్నయ్య బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఢిల్లీలో తాను నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ తన ఫోటోలను మార్ఫింగ్ చేశారన్నారు. చనిపోయాక అయినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని వివరించారు. అందుకే లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తులు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్, మీడియాకు లేఖ రాశారు. ఎమ్మెల్యే దుర్గంకు, అరిజిన్ డెయిరీ పాల కంపెనీ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.