వరంగల్ రైల్వే స్టేషన్(Warangal Railway Station)లో గంజాయి కలకలం రేపింది. నాలుగు బస్తాలు గంజాయితో ఉన్న వాటిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) గుర్తించారు.స్టేషన్లో తనిఖీ చేస్తున్నప్పుడు రైల్వే పోలీసులు నాలుగు అనుమానాస్పద బ్యాగ్‌లను కనుగొన్నారని.. ఆ బస్తాలను తనిఖీ చేయగా అందులో 50 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఆ బ్యాగులను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందజేశారు. ఈ సంవత్సరంలో ఆర్పిఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ డ్రగ్స్‌ను తీసుకెళ్తున్న 49 మందిని అరెస్టు చేసి సంబంధిత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు అధికారి తెలిపారు. దీని విలువ రూ.50 లక్షలు వరుకు ఉంటుందని కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ వెల్లడించారు.
తెలంగాణలో వ్యాప్తంగా ఇటీవల గంజాయి (ganjaayi)రవాణా అధికంగా జరుగుతుంది.ఇటీవల కాలంలో గంజయిని స్మగ్లింగ్ పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయి రవాణాని అరికట్టేందకు తెలంగాణ (Telangana) పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికి స్మగ్లర్లు పోలీసులు కళ్లుగప్పి గంజాయిని తరలిస్తున్నారు గంజాయిని స్మగ్లింగ్ పై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న అక్రమ రవాణా మాత్రం ఆపడం లేదు. ఈ సంవత్సరం ఆర్ఫీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ (Secunderabad Division) డ్రగ్స్ ను తీసుకెళ్తున్న 49 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సంబంధిత లా ఎన్ ఫోర్స్ మెంట్ (Enforcement) ఏజెన్సీలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్ఫీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ లో 39 సంఘటనల్లో రూ. 11.32 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల ఉత్పత్తులను రికవరీ చేశామని వివరించారు.