»50 People Got Sick After Eating Prasadam Tirupati District
Tirupati district: ప్రసాదం తిని 50 మందికి అస్వస్థత!
ఏపీలోని తిరుపతి జిల్లా(tirupati district)లో కలుషితమైన ప్రసాదం స్వీకరించి 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. అయితే వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
50 people got sick after eating Prasadam tirupati district
ఆంధ్రప్రేదేశ్లోని తిరుపతి జిల్లా(tirupati district)లో కలుషిత ప్రసాదం(Prasadam) కలకలం రేపుతోంది. కేబీపురం మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో వండిన ప్రసాదాన్ని నిర్వహకులు గ్రామస్థులకు అందించారు. అయితే ఆ ప్రసాదం తిన్న గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించారు. కొంత మంది ఇప్పటికే డిశ్ఛార్జ్ కాగా..మరో 30 మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు ప్రసాదం ఎలా కలుషితం అయ్యింది? ఆ ఆహారంలో ఎవరైనా ఏదైనా కలిపారా? లేదా తయారు చేసే క్రమంలో అందులో ఏదైనా పడిందా ? పాడైపోయిన ప్రసాదాన్ని నిర్వహకులు పంపిణీ చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆ విషయం తెలిసిన అధికారులు ఈ సంఘటన ఎలా జరిగిందనే వివరాలను సేకరిస్తున్నారు.