హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల (Hyderabad Cricket association Elections) ఫలితాలను వెల్లడించారు. నేడు జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్మోహన్ రావు (Jagan Mohan Rao) విజయాన్ని పొందారు. ఈ ఎన్నికల్లో యునైైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ తరపున ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేశారు. తన ప్రత్యర్థి అమర్ నాథ్‌పై 2 ఓట్ల తేడాతో జగన్మోహన్ రావు విజయాన్ని సాధించారు.
ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో నేడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను (HCA) నిర్వహించారు. ఈ ఎన్నికలకు హెచ్‌సీఏ సభ్యుల సంఖ్య 173గా ఉంది. అయితే ఇందులో 169 మంది ఎన్నికల్లో ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలీ రాజ్, ప్రజ్ఞాన్ ఓజా, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం ఇదే: జగన్మోహన్ రావు – అధ్యక్షుడు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సీఏ ప్యానెల్) దల్జీత్ సింగ్ – ఉపాధ్యక్షుడు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్) దేవరాజు – కార్యదర్శి (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) బసవరాజు – సంయుక్త కార్యదర్శి (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్) సీజే శ్రీనివాసరావు – ట్రెజరర్ (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సీఏ ప్యానెల్) సునీల్ అగర్వాల్ – కౌన్సిలర్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)