Rahul Gandhi: బీజేపీ-బీఆర్ఎస్-మజ్లిస్ ఒక్కటే.. కేసీఆర్పై ఒక్క కేసు లేదు
బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని.. అదే తెలంగాణ సీఎం కేసీఆర్పై మాత్రం ఒక్క కేసు లేదని పేర్కొన్నారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బిజీ బిజీగా ఉన్నారు. ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో ఈ రోజు మాట్లాడారు. ఇక్కడ వేల మంది కాంగ్రెస్ పులులు ఉన్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు ఇందిరాగాంధీ, సోనియా గాంధీకి మద్దతు పలికారని పేర్కొన్నారు. పసుపు బోర్డు విషయంలో ప్రధాని మోడీ మాట తప్పారని విమర్శించారు. రైతులకు ఎంత డబ్బులు ఎక్కువ ఇస్తే అంత మంచిది జరుగుతోంది.
అనుబంధం
తన కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి బీజేపీ నేతలు క్యూ కడుతున్నారని.. కానీ తమకు ఆ అవసరం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు మజ్లిస్ పార్టీ మద్దతు తెలుపుతుందని.. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు. తనను బీజేపీ ఎంపీ పదవీ తొలగించింది, ఇంటిని కూడా తీసుకుందని వివరించారు. తనకు ఇల్లు లేకున్నా ఫర్లేదు.. ప్రజల హృదయంలో స్థానం ఉందన్నారు. తనపై 24 కేసులను మోడీ సర్కార్ నమోదు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై మాత్రం ఎలాంటి కేసులు ఉండవన్నారు. దేశంలో అవినీతి సీఎం కేసీఆర్ అని.. దేశం మొత్తం తెలుసు అన్నారు.
కేసీఆర్ తప్ప
దేశంలోని ఇతర విపక్షాలకు చెందిన సీఎంల మీద మోడీ పడతారు.. కానీ కేసీఆర్ను ఇబ్బందికి గురిచేయడని వివరించారు. రైతు బిల్లు, నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా ఉందని గుర్తుచేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం.. అక్కడ మజ్లిస్ అభ్యర్థులను నిలబెడుతోందని.. అందుకు కారణం, కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని తెలిపారు. బీజేపీకి సాయం చేయడం, కాంగ్రెస్ పార్టీని ఓడించడం వారి ఉద్దేశం అన్నారు.
దొరల పాలనకు గుడ్ బై..?
అంతకుముందు మోర్తాడ్ కార్నర్ మీటింట్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి, ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకు కుటుంబ అనుబంధం ఉందన్నారు. నెహ్రూ, ఇందిరా హయాం నుంచి ఆ రిలేషన్ షిప్ కొనసాగుతోందని తెలిపారు. ఇక్కడే కాదు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటాయని తెలిపారు. అంతకుముందు జగిత్యాల కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ఆర్మూర్ మీటింగ్తో రాహుల్ గాంధీ తొలి విడత ప్రచారం ముగిసింది.