one lakh 53 thousand bonus for Singareni workers this Dussehra 2023
తెలంగాణలో సింగరేణి కార్మికులకు సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ దసరా పండుగ సందర్భంగా ప్రతి కార్మికునికి లక్షా 53 వేల రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా సింగరేణిలో పనిచేస్తున్న 42 వేల మంది కార్మికులకు లబ్ది చేకూరనున్నట్లు చెప్పింది. అయితే ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.711 కోట్లను రిలీజ్ చేసింది.
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించినట్లుగా సంస్థ గత ఏడాది లాభాల్లో 32 శాతాన్ని బోనస్ గా చెల్లిస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. మొత్తం లాభం రూ.2,222.46 కోట్లు కాగా..అందులో 32 శాతం రూ.711.18 కోట్లను ఈ పండుగ బోనస్ ను ప్రకటించారు. అయితే ఉద్యోగుల హాజరును బట్టి వారి బోనస్ తీసుకునే విధానంలో నగదు మారుతుందన్నారు. భూగర్బ గని కార్మికులకు రోజుకు రూ.749.58 చొప్పున అందజేయగా..సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రోజుకు రూ.617.41 చొప్పున ఇస్తారు. ఇక మిగిలిన శాఖల్లో పనిచేసే సిబ్బందికి రోజుకు రూ.578.69 చొప్పున అందజేస్తారు.