»India Tv Opinion Polls Brsk Majority Of Seats In Lok Sabha Elections
India TV Opinion Polls: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మెజారిటీ సీట్లు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని తాజాగా వెల్లడైంది. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ రిపోర్టు తెలిపింది.
India TV Opinion Polls: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని తాజాగా వెల్లడైంది. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ రిపోర్టు తెలిపింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది.
బీఆర్ఎస్ తర్వాత బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్స్ రిపోర్ట్ తెలుపుతున్నాయి. బీజేపీ 6 లోక్‌సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. మిగిలిన ఒక్క స్థానం మజ్లిస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ పోల్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే లోక్‌సభ ఎన్నికలు వరకు వేచియుండాల్సిందే.