బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది.
VHP leader Vinod Bansal: తమ నుంచి బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. గత 500 ఏండ్లలో మీ పూర్వీకులు ఎవరైనా అయోధ్యను సందర్శించారా? అని వీఎచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ప్రశ్నించారు. లండన్లో చదివిన అసదుద్దీన్.. మసీదు కాపాడేందుకు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇది రాజకీయమని ఒవైసీ త్వరలో రామ భక్తులుగా మారడంతో పాటు రామనామం జపిస్తారని సెటైర్ వేశారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు సమయంలో ఆలయం లేదని పేర్కొన్నారు. బాబ్రీ మసీదును కూల్చకపోయి ఉంటే.. ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లింలు చూడాల్సి వచ్చేది కాదన్నారు.
బాబ్రీ మసీదులో ముస్లింలు 500 ఏండ్లకు పైగా నమాజ్ చేశారని, యూపీ సీఎంగా జీబీ పంత్ ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలను ఉంచారని పేర్కొన్నారు. అయోధ్య కలెక్టర్గా ఉన్న నాయర్ మసీదును మూసివేసి, అక్కడ పూజలు ప్రారంభించారని ఒవైసీ అన్నారు. రామ మందిరం గురించి మహాత్మాగాంధీ కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదని, ఒక క్రమ పద్ధతిలో బాబ్రీ మసీదును భారతీయ ముస్లింల నుంచి లాగేసుకొన్నారని పేర్కొన్నారు.