లండన్లో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) బ్రాహ్మణపల్లికి చెందిన ఓ యువతి హత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే… తేజస్విని రెడ్డి(Tejaswini Reddy)(27) ప్రస్తుతం లండన్ లో ఉంటూ ఎంఎస్ చేస్తోంది. ఈ మధ్యనే తన కోర్సును పూర్తి చేసిన ఆమె… ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. బ్రెజిల్(Brazil)కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసిచంపేశాడు.మంగళవారం (జూన్13,2023) ఉదయం 10గంటల సమయంలో వెంబ్లీ(Wembley)లోని నీల్డ్ క్రెసెంట్ ప్రాంతంలో బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ఆమెను కత్తితో దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొంతం తేజస్విని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడిలో 28 ఏళ్ల మరో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్సపొందుతోంది. నిందితుడిని లండన్ (London) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యా (Murder)స్థలంలో ఉన్న 24 ఏళ్ల యువకుడితో పాటు మరో 23 ఏళ్ల యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తరువాత కాసేపటికే యువతిని పోలీసులు విడిచిపెట్టారు. తేజస్విని తన స్నేహితులతో కలిసి నివసించే అపార్టుమెంట్ లోకి వారం క్రితం సదరు నిందితుడు షిఫ్టు అయ్యాడని పోలీసులు తెలిపారు.