Gym Trainer: హవ్వా.. మరిదితో వివాహేతర సంబంధం, భర్తను హతమార్చిన భార్య
మరిది వరస అయ్యే చిన్నాతో దుర్గా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త జయకృష్ణ ఊరు వెళదాం అని చెప్పడంతో.. అడ్డుగా ఉన్న అతడిని తొలగించుకుంది. ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది.
Gym Trainer:జిమ్ ట్రైనర్ జయకృష్ణ మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడు.. వరసకు మరిది అయ్యే చిన్నాతో కలిసి భర్తను భార్య దుర్గా హతమార్చింది. అగ్నిప్రమాదంలో మృతిచెందాడని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది. వారం రోజుల క్రితం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో గల జగద్గిరిగుట్టలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
జయకృష్ణ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. విచారించారు. ఎంక్వైరీలో దుర్గా-చిన్నాకు వివాహేతర సంబంధం ఉందని.. ఊరు వెళదాం అని చెప్పడంతో హత్యకు దారితీసిందని పోలీసులు వివరించారు. గత ఐదేళ్ల నుంచి దుర్గా-చిన్నాకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. దుర్గాకు చిన్నా మరిది వరస అవుతాడు. హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ తన సొంత ఊరు కృష్ణా జిల్లాకు షిప్ట్ చేయాలని దుర్గా భర్త జయకృష్ణ భావించాడు. ఈ విషయం భార్యకు చెప్పాడు. ఆమె కూడా సరే అంది.
ఊరెళ్లి ఇంటికి రాగా తమ ప్రణాళికను అమలు చేశారు. ఆ రోజు చిన్నా-జయకృష్ణ కలిసి వారింట్లోనే మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా.. జయకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు చిన్నా. అక్కడినుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత అగ్నిప్రమాదం జరిగిందని నమ్మబలికారు. భర్త అడ్డు తొలగితే.. కలిసి ఉండొచ్చని భావించారు. చివరికీ కటకటలా పాలయ్యారు. జయకృష్ణ-దుర్గా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరిది వరస అయ్యే చిన్నాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అదీ భర్తను హత్య చేసే వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.