జూనియర్ పంచాయతీ కార్యదర్మలకు (JPC) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం కేసీఆర్ (CM KCR) వారిని పర్మినెంట్ చేసేందుకు గ్రీన్ ఇచ్చారు. ఇందుకు సంభందించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్మి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (JPC) సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. జేపీఎస్‌లు అందరినీ క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా(Sandeep Kumar Sultania)ను సీఎం ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సమీక్ష చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్(District Collector)తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండనున్నారు. తమను పర్మినెంట్ చేయాలని గతకొన్ని రోజుల క్రితం ఆందోళనలు చేసి విరమించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీపి వార్త తెలిపారు. జేపీఎస్‌లు అందరినీ క్రమబద్దీకరించాలని (Permanent) నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సమీక్ష చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, పాల్గొన్నారు.