»Godavarikhani Daughter Bought Land At Moon Gave To Her Mother
Moonపై తల్లికి భూమి.. గిప్ట్ ఇచ్చిన కూతురు
గోదావరిఖనికి చెందిన సాయి విజ్ఞత.. అమెరికాలో ఉంటున్నారు. ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. చంద్రమండలంపై ఎకరం భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని తన తల్లికి అందజేశారు.
Godavarikhani Daughter Bought Land At Moon Gave To Her Mother
Godavarikhani Daughter Bought Land At Moon: చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడింది. ఆ ప్రాంతాన్ని శివశక్తి అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్‌లో ఉంది. చంద్రుడిపై మానవ మనుగడ కోసం నిరంతరం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ తన తల్లికి చంద్రునిపై భూమి కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ చంద్రయాన్-3 ప్రయోగం చేసిన రోజు పూర్తి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆగస్ట్ 23వ తేదీన ఎకరం భూమిని తల్లి వకుళాదేవి (vakuladevi), చెల్లి ఆర్త (artha) పేరుతో రిజిస్ట్రేషన్ చేయించింది. తన తల్లికి చంద్రమండలంపై భూమి కొనిచ్చి తన ప్రేమను చాటుకుంది. తల్లితోపాటు చెల్లి పేరు కూడా రాసి ఇచ్చింది. జాబిల్లిపై భూమి కొనుగోలు చేయాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లూనార్ రిజిస్ట్రీ వెబ్ సైట్ ఓపెన్ చేసి.. భూమి కొంటున్నారు. భూమి కొనాలనే ప్రాంతాన్ని ఎంపిక చేసి.. తర్వాత కొనుగోలు చేయాలి. డాక్యుమెంట్స్ కూడా మెయిల్‌కు రిసీవ్ చేసుకుంటారు. చంద్రమండలంపై ఇదివరకు సెలబ్రిటీలు భూమి కొనుగోలు చేశారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు కొన్నారు.
గోదావరిఖని (Godavarikhani) జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచంద్ర (suddala ramachandra), వకుళాదేవి (vakuladevi) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సాయి విజ్ఞత అమెరికాలో (america) గల ఐయోవాలో ఉంటున్నారు. గవర్నర్ కిమ్ రెనాల్డ్స్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా.. ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ఉంటున్నారు. భూమి కొనుగోలుకు సంబంధించి 2022లో ఆప్లై చేసుకుని.. ఈ ఏడాది కొనుగోలు చేశారు.