బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను ఎవరికీ భయపడనని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. అవసరమైతే ప్రధానిని కూడా లెక్క చేయనని చెబుతున్నారు.
CM KCR Offer RS.20 Crores To Each MLA: Mainampally Hanumantha Rao
CM KCR Offer RS.20 Crores: అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mainampally Hanumantha Rao) కొరకరాని కొయ్యగా మారారు. తన కుమారుడికి మెదక్ టికెట్ కావాలని కోరారు. అయినప్పటికీ హైకమాండ్ ఆ టికెట్‌ను పద్మా దేవేందర్ రెడ్డికి కన్ఫామ్ చేసింది. ఇక అప్పటినుంచి తిరుగుబావుటా ఎగరవేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా కామెంట్స్ చేశారు. తర్వాత మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. ఇంతలో ఆయన పేరుతో ఓ ఆడియో బయటకు వచ్చింది. అదీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
అదర బెదర
2.54 నిమిషాల పాటు ఉన్న ఆడియోలో మైనంపల్లి (Mainampally) తాను మోనార్క్ అని.. తనను తాను తిట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు తాను ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్, కేటీఆర్.. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా లెక్కచేయనని తెలిపారు. తాను ఎవరి దగ్గరకు వెళ్లానని.. తన వద్దకు ఎవరూ రారని చెప్పారు. ఇటీవల ప్రకటించిన సీట్ల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. 90 శాతం టికెట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకే కేటాయించారని మైనంపల్లి (Mainampally) విమర్శించారు.
రేవంత్‌కే ధమ్కీ ఇచ్చా..?
తాను ఎవరి మాట విననని.. టీడీపీలో ఉన్నప్పుడు.. రేవంత్ రెడ్డి (Revanth reddy), మహేందర్ రెడ్డికి (mahender reddy) వార్నింగ్ ఇచ్చానని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రాకు మద్దతిచ్చానని పేర్కొన్నారు. సీఎం అన్న కొడుకు, ఉమేశ్ రావు, కాంతారావు విషయంలో కూడా తాను వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. ఏదో డీల్ గురించి ఫోన్లో మాట్లాడుకున్నారు. అలాగే మల్కాజిగిరి నియోజకవర్గంలో తిష్ట వేస్తోన్న నేతలకు ఫోన్ చేసి మైనంపల్లి హనుమంతరావు దమ్కీ ఇచ్చారు. ఆ సమయంలోనూ సీఎం కేసీఆర్ (cm kcr), మంత్రి కేటీఆర్ (minister ktr) గురించి కూడా ప్రస్తావించారు.
కాంగ్రెస్ వైపు చూపు..?
మెదక్ అసెంబ్లీ నుంచి మైనంపల్లి (Mainampally) తన కుమారుడికి టికెట్ కావాలని హైకమాండ్‌ను కోరారు. కానీ అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. సో.. అప్పటినుంచి మైనంపల్లి (Mainampally) ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీ, అధినేతకు సమయం ఇచ్చారు. కుమారుడికి టికెట్ ఇస్తే, గెలిపించుకొని వస్తానని అంటున్నారు. లేదంటే ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. లేదంటే తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసే అవకాశం ఉంది.