Jupally Krishnarao: బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటమే తమ లక్ష్యం అని మాజీమంత్రి జూపలి కృష్ణారావు (Jupally Krishnarao) అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీలో చేరలేదు. బీజేపీ, కాంగ్రెస్ అంటూ ప్రచారం జరుగుతోంది. జూపల్లి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి (ponguleti srinivas reddy) మాత్రం క్లారిటీ ఇవ్వడం లేవు. మరో 15 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి స్పష్టత వస్తోందని జూపలి కృష్ణారావు (Jupally Krishnarao) అంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దు.. ప్రశ్నించొద్దు అనే వైఖరితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలు కలవొద్దు, ధర్నా చేయొద్దనే విధానంలో ముందుకు వెళుతుందని మండిపడ్డారు. ఉద్యమ పవిత్రత పోయిందని.. కేసీఆర్ సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు. మూడోసారి అధికారం చేపట్టే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పారు.
కేసీఆర్ (kcr) సర్కార్‌పై వ్యతిరేకత ఉందని జూపల్లి కృష్ణారావు (Jupally Krishnarao) అన్నారు. తమతో కలిసి వచ్చేవారితో పనిచేస్తామని చెబుతున్నారు. ఏదో ఒక పార్టీ రాజీ పడాల్సిందేనని చెప్పారు. తమ ఎజెండా బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే అని తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మమేకం అయిన కవులు, కళాకారులు, రచయితల్లో బాధ ఉందని.. వారందరినీ సంఘటితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల ఆశ నెరవేర్చేందుకు అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజాం ప్రభుత్వ హయాంలో జరగని దుర్మార్గాలు ఇప్పుడు జరుగుతున్నాయని జూపల్లి (jupally) మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వస్తే.. లోక్ సభకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని చెప్పారు. బోగస్ మాటలు విని జనం తీర్పు ఇచ్చారని జూపల్లి (jupally) వివరించారు. దళితబంధు పథకం అనేది ఈటల రాజేంధర్‌ను (Etela rajender) హుజురాబాద్‌లో ఓడించేందుకు పెట్టిన స్కీమ్ అన్నారు. 10 లక్షల మంది బీసీ కార్మికులకు రుణం ఇవ్వలేదని గుర్తుచేశారు. ఎస్పీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇవ్వడం లేదని తెలిపారు. మరీ తెలంగాణ తీసుకొచ్చింది ఎందుకు అని అడిగారు. ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగడం లేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. ప్రజల నెత్తిన అప్పుల కుప్ప పెట్టారని జూపల్లి (jupally) అంటున్నారు. తాను, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఇతర ముఖ్యులు కలిసి పనిచేస్తాం అని ఇండైరెక్టుగా చెప్పారు. తమతో ఈటల రాజేందర్.. ఇతరులు కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.. కానీ తమ లక్ష్యం మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే అని చెబుతున్నారు.