అపరిశుభ్రం (UnSanitary).. కుళ్లిపోయిన పదార్థాలు, నాసిరకం (Cheap) నాణ్యతతో వంటలు (Food) వండుతున్న హోటళ్లపై (Hotels) ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఉక్కుపాదం మోపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు (Complaints) అందుతున్న హోటల్, బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లో ఒక్కసారిగా అధికారుల బృందాలు దాడులు చేశాయి. వారి దాడితో హోటళ్ల నిర్వాహకులు భయాందోళన చెందారు.
పాచిపోయిన, నాణ్యత లేని బిర్యానీ, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, కూరగాయలు, ఇతరత్రా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు శనివారం ఒక్కసారిగా హైదరాబాద్ లో దాడులు చేపట్టారు. ఆసిఫ్ నగర్ (Asif Nagar), బోరబండ, ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు (Rules and Regulations) పాటించని పలు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలు (Quality Standards) పాటించలని పలు హోటళ్లపై కేసులు (Cases) కూడా నమోదు చేసినట్టు సమాచారం. మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానా (Fine) విధించారని తెలుస్తోంది. వినియోగదారులకు శుచీ శుభ్రత పాటించి నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్, రెస్టారెంట్ యజమాన్యాలకు సూచించారు. మరోసారి ఇలాంటివి పునరావృతమవుతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.