MNCL: లక్షెట్టిపేటలో అటవీ శాఖ, పోడు రైతుల సమస్య మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీ పోడు రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల గురించి వినతిపత్రం అందజేయడానికి వచ్చిన దమ్మన్నపేట గ్రామానికి చెందిన పోడు రైతులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి వేడెక్కింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.