KRNL: ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో తేలుకాటుతో విద్యార్థి మృతి చెందింది. కురువ శేఖర్, శకుంతలకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సరస్వతి పత్తి చేనులో తేలుకాటుకు గురై మృతి చెందినట్లు తండ్రి శేఖర్ తెలిపారు. సరస్వతి దైవందిన్నె జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోందన్నారు. బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.