KNR: కరీంనగర్లో 35 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన ఏఆర్ ఎస్సై మహ్మద్ అంకుషావలీకి పదవీ విరమణ సందర్భంగా సన్మానం నిర్వహించారు. అదనపు డీసీపీ వెంకటరమణ ఆయన సేవలను ప్రశంసించారు. సహచరులు, కుటుంబ సభ్యులు జ్ఞాపికలు అందజేసి పోలీస్ బ్యాండ్‌తో, పోలీసు వాహనంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎసీపీలు శ్రీనివాస్, మహ్మద్ కరీం, మహ్మద్ మన్నాన్ పాల్గొన్నారు.