WNP: బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు ఏదైనా ఎన్నికలకు సిద్ధమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆఫీసులో గోపాల్ పేట మండల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలకు అంబాసిడర్ అని, ఇచ్చిన హామీలను నిలుపుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.