GDWL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు జరిగే సీతారాముల కల్యాణానికి ఆలయాలు ముస్తాబు అయ్యాయి. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుప్పత్రాల గ్రామంలో వెలసిన సీతారామాంజనేయ స్వామి ఆలయం వేడుకలకు ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. నిన్న గ్రామస్థులు, ఆలయ అర్చకులు పందిరి కార్యక్రమం నిర్వహించారు.