NLG: కనగల్లోని మోడల్ స్కూల్/ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ 2nd Year విద్యార్థిని ఆవుల వైష్ణవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 8న భువనగిరిలో జరిగిన పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ థామసయ్య ఇవాళ తెలిపారు. వైష్ణవి ఈ నెల 10,11,12 తేదీల్లో మహబూబాబాద్, నర్సంపేటలో జరిగే అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు.