RR: రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ సమీపంలో దారుణ హత్య వెలుగుచూసింది. టోలి చౌకికి చెందిన అమీర్ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.