MNCL: జైపూర్ మండల కేంద్రంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంగ్లిషు జూనియర్ లెక్చరర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.నాగేశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలని వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు గురుకులంలో సంప్రదించాలని కోరారు.